Site icon NTV Telugu

Mirai : US బాక్సాఫీస్‌లో మిరాయ్ మ్యాజిక్.. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న తేజ సజ్జ

Mirai

Mirai

యంగ్ & టాలెంటెడ్ హీరో తేజ సజ్జ – రితిక నాయక్ జంటగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన విజువల్ వండర్ “మిరాయ్” థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రేక్షకుల అంచనాలను నిలబెట్టుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది.

Also Read : Sridevi–Roshan : కోర్ట్ జంట శ్రీదేవి–రోషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌తో పాటు యూఎస్‌లో కూడా మిరాయ్ శక్తివంతమైన ఆరంభం నమోదు చేసింది. తొలి రోజు రూ. 27.2 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టగా, రెండో రోజు రూ.28.4 కోట్లు, మూడో రోజు రూ.81.2 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. వారాంతం వ‌ర‌కు ‘మిరాయ్’ రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రేక్షకులు విశేషంగా చర్చిస్తున్నారు. కాగా తాజాగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటివరకు 1.8 మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టి అదరగొట్టింది. దీంతో త్వరలోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమవుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేగం చూస్తుంటే మిరాయ్ అమెరికన్ బాక్సాఫీస్‌లో మరింత సత్తా చూపనుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కంటెంట్, విజువల్స్, తేజ సజ్జ పెర్ఫార్మెన్స్, రితిక నాయక్ గ్లామర్ – అన్నీ కలిపి మిరాయ్ను బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మార్చేశాయి.

 

Exit mobile version