Mirai : యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ట్రైలర్ తో విపరీతమైన అంచనాలు పెంచేసింది ఈ సినిమా. ఇందులోని వీఎఫ్ ఎక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ, స్క్రీన్ ప్లే అంతా డిఫరెంట్ గా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ గురించి ఆన్ లైన్ లో ఎక్కువగా వెతుకుతున్నారు. అసలు మిరాయ్ అంటే అర్థం ఏంటా అని ఆరా తీస్తున్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదం. మిరాయ్ అంటే ‘భవిష్యత్తు కోసం ఆశ’ అని అర్థం. ఈ సినిమా కథకు తగ్గట్టే ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. అశోకుని కాలంలో జరిగిన కళింగయుద్ధంలో దొరికిన రహస్యం ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్. మనిషిని దేవుడిని చేసే తొమ్మిది గ్రంథాల రహస్యం.. దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే గ్రహణం.. ఆపడానికి పుట్టిన జననం అని ఇప్పటికే ట్రైలర్ లో కథను పరిచయం చేశారు.
Read Also : SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్
అంటే ఆ రహస్యాన్ని చేధించడానికి విలన్ అయిన మంచు మనోజ్ ప్రయత్నిస్తే.. అతన్ని అడ్డుకోవడానికి హీరో తేజసజ్జా ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే సినిమాలోని కథ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇందులో తేజసజ్జ స్పెషల్ పవర్స్ ఎలా తెచ్చుకున్నాడనేది కూడా చూపించబోతున్నారు. పురాణాల ఆధారంగానే దీన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇందులో రామాయణం కూడా టచ్ చేశారంట. పురాణాల్లోని కొన్ని అంశాలను సినిమాలోని సీన్స్ కు లింక్ చేస్తూ షూట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నడుమ పురాణాలకు సినిమా కథలకు లింక్ పెడుతున్న విషయం తెలిసిందే. మరి మిరాయ్ ట్రైలర్ రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లు హనుమాన్ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉంది.
Read Also : Allu Arjun : చిరంజీవి మాటలకు ఏడ్చేసిన బన్నీ
