Site icon NTV Telugu

Minnal Murali: కేరళ సూపర్ హీరో సినిమాకి సీక్వెల్ వస్తోంది

Minnal Murali Sequel

Minnal Murali Sequel

Minnal Murali Sequel Getting Ready: అవెంజర్స్, సూపర్‌మాన్, స్పైడర్‌మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి, మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. లైట్నింగ్ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే పవర్ ఉంటే, అనే పాయింట్ ‘మిన్నల్ మురళి’ సినిమాని ఇంటరెస్టింగ్‌గా మార్చింది. బాసిల్ జోసెఫ్ ‘మిన్నల్ మురళి’ సినిమాని అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు. అతితక్కువ బడ్జట్‌లో ఒక సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని నిరూపించిన బాసిల్ జోసెఫ్, మిన్నల్ మురళి సినిమాకి సీక్వెల్‌ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

సూపర్ హీరో సినిమాలని అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారు కానీ రీమేక్ చేసి రిలీజ్ చేయరు. అందుకే మిన్నల్ మురళి డబ్బింగ్ రైట్స్‌ని ఎవరికీ అమ్మలేదు. ఇండియాలో ఒక సూపర్ హీరో ఉండాలి, అతను టివినో థామస్ మాత్రమే అయ్యి ఉండాలి అని స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేసిన బాసిల్ జోసెఫ్, ఇటివలే ‘జయ జయ జయ జయహే’ అనే సినిమాని డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ వర్క్స్ నుంచి కంప్లీట్‌గా బయటకి వచ్చేసిన బాసిల్ జోసెఫ్ త్వరలో మిన్నల్ మురళి సీక్వెల్ పనులు స్టార్ట్ చేయనున్నాడు. పార్ట్ 1కి మలయాళ థియేటర్స్‌కి మాత్రమే పరిమితం అయిన మిన్నల్ మురళి, ఈసారి మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Exit mobile version