Site icon NTV Telugu

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మంత్రి తలసాని ఆరా

Sai-Dharam-Tej

మెగా హీరో సాయి ధరఎం తేజ్ నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురవ్వడంతో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతివేగం కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడి అల్లు అరవింద్ కు ప్రమాదం ఏమీ లేదని అన్నారు. డాక్టర్లు కూడా 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోగ్యం విషయమై ఆరా తీశారు. గణనాధుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు.

Read Also : సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

సాయి ధరమ్ తేజ్ దుర్గం చెరువు కేబుల్ వంతెనపై స్పోర్ట్స్ బైక్‌పై వెళుతుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగింది. రాత్రి జరిగిన ఈ సంఘటనలో సాయి ధరమ్ తేజ్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. తేజ్ తాజా చిత్రం “రిపబ్లిక్” అక్టోబర్ 1 విడుదలకు సిద్ధమవుతోంది. మెగా నటుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Exit mobile version