Minister Roja: మినిస్టర్ రోజా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తున్న పేరు. అన్న జగన్ కు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తన ఘాటు వ్యాఖ్యలతో ఏకిపారేస్తున్నారు. గత మూడు రోజులుగా రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఆమెను డైమండ్ రాణి అనడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. పవన్ ప్యాకేజ్ స్టార్ అని, తోటి కళాకారులను ఎలా గౌరవించాలో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చంద్రబాబు వద్ద నుంచి పవన్ కు సంక్రాంతి మామూళ్లు కూడా అందాయని అన్న రోజా.. జగన్ ను ఏమి చేయలేక పనికిమాలిన మీటింగ్ లు పెట్టుకొని మంత్రులను తిడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే మరోసారి రోజా, నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ గురించి ఆమె ఘాటుగా స్పందించారు.
నేడు విజయవాడ భవానీ ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాలలో పర్యాటక శాఖా మంత్రి రోజా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమెకు అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్న ఎదురవ్వగా ఆమె మాట్లాడుతూ ” అన్ స్టాపబుల్ షో కి వెళ్ళే ఉద్దేశం తనకు లేదని.. చంద్రబాబు ఇంటర్వ్యూ చూసాక ఆ షో మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందని చెప్పుకొచ్చారు. అసలు ఆ షోలు కూడా వారు డబ్బుకోసమే చేస్తున్నారని, ప్రజలకు తెలియని నిజాలా..? అందులో బయటపడేవి ఏమి లేవని, ప్రజలకు వారి గురించి బాగా తెలుసనీ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. జబర్దస్త్ కన్నా అన్ స్టాపబుల్ చీపా.. అయినా మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే కదా మీరు రాను అని చెప్పడానికి.. అసలు వారు పిలవరు అని కొందరు. ఒకానొక సందర్భంలో జబర్దస్త్ వేదికపై రోజా.. బాలకృష్ణకు ఫోన్ చేసి జబర్దస్త్ కు రావాలని కోరగా.. ఆయన ఎంతో మర్యాద పూర్వకంగా సమయం చూసుకొని వస్తాను అని చెప్పారు. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఆయన చేస్తున్న షో గురించి ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అది బాలయ్యకు, మీకు ఉన్న తేడా.. కొంచెం ఆయనను చూసి నేర్చుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
