Site icon NTV Telugu

Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే

Roja

Roja

Minister Roja: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రోజా , రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 90వ దశకంలో ఈ నటీమణులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల సినిమాలు అంటే .. ముందుగా గుర్తొచ్చేది వీరి పేర్లే. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. రోజా.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి.. ప్రస్తుతం ఏపీ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఇక రమ్యకృష్ణ.. తన నటనకు బ్రేకులు వేయకుండా వరుస సినిమాలతో కొనసాగుతోంది. ఇక వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెల్సిందే.. వీరిద్దరి కాంబోలో సుమారు 10 సినిమాలు వరకు వచ్చి ఉంటాయి. అసలు రోజా, రమ్యకృష్ణ కాంబో అనగానే సమ్మక్క- సారక్క సినిమానే గుర్తొస్తుంది. అక్కాచెల్లెళ్లు దేవతులుగా ఎలా మారారు అనే కథతో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాలు చేసేటప్పుడు.. నిత్యం కలుసుకొనే ఈ స్నేహితులు ఇప్పుడు అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. తాజాగా సమ్మక్క సారక్క రే యూనియన్ అయ్యారు.

Akkineni Nagarjuna: ఆ స్టార్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్.. మరో ఊపిరి అయితే కాదుగా.. ?

నేడు రమ్యకృష్ణ తన కొడుకుతో కలిసి తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న విషయం తెల్సిందే. స్వామి దర్శనం అనంతరం.. రమ్యకృష్ణ.. రోజా ఇంటికి వెళ్ళింది. ఇక పాత స్నేహితురాలిని చూడగానే రోజా ముఖంలో నవ్వు విరబూసింది. కుటుంబంతో సహా రమ్యకృష్ణను ఆహ్వానించి శాలువాతో సన్మానించింది. ఇక ఇద్దరు కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని.. సారె ఇచ్చి స్నేహితురాలిని సాగనంపింది. ఇక ఈ విషయాన్నీ రోజా.. ట్వీట్ చేస్తూ.. “మంచి స్నేహితులు నక్షత్రాల లాంటి వారు. వారిని ఎప్పుడు మనం కలవకపోవచ్చు.. కానీ, వారు ఎప్పుడు మన మనస్సులో అలాగే నిలిచి ఉంటారు. ఈ రోజు నా ఇంటికి వచ్చి నా రోజును చాలా అందంగా మార్చిన నా నక్షత్రానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాను. ఆ రోజుల్లో జీవితం ఎలా ఉండేదో, ఆ నవ్వులు, మనం కలుసుకున్నప్పుడు, ఎంత సమయం గడిచినా, నా బెస్టీ రమ్యకృష్ణతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో ఆనందం ఉంది. అది అద్భుతం” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరు హీరోయిన్లను ఒకే ఫ్రేమ్ లో చూడడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version