NTV Telugu Site icon

Minister Roja: మెగా ప్రిన్సెస్ జననం.. ఆ హత్తుకోవడం ఇంకా మరువలేదంటూ రోజా ఎమోషనల్!

Rk Roja Comments On Mega Pr

Rk Roja Comments On Mega Pr

Minister rk roja congratulates chiranjeevi and ram charan: ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో మంగళరవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యుల ఆనందం రెట్టింపు అయింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులకే కాక మెగా స్టార్ కుటుంబానికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
AAA cinemas: ప్రమోషనల్ ఈవెంట్లకి కొత్త కేరాఫ్ అడ్రస్ గా ‘’ఏఏఏ సినిమాస్’’
ఈ క్రమంలో తాత అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు అని అంటూ ట్వీట్ చేశారు మాజీ హీరోయిన్, సినీ నటి, ప్రస్తుత ఏపీ మంత్రి రోజా. ఎప్పుడూ యవ్వనంగా ఉంటూ మరియు ఎల్లప్పుడూ శక్తివంతంగా వికసించే ఈ కుటుంబంలో మనోహరమైన మెగా ప్రిన్సెస్‌తో ఆశీర్వాదం పొందడం సర్వశక్తిమంతుడయిన భగవంతుడి ఆశీర్వాదం అని ఆమె అన్నారు. ఇక ప్రియమైన రామ్ చరణ్, నేను చిన్నప్పుడు నిన్ను నా చేతులలో కౌగిలించుకున్న ఆ చిరస్మరణీయమైన రోజులను నాకు ఇంకా గుర్తు ఉన్నాయి ఇప్పుడు మీకు కుమార్తె ఉంది అనే సంతోషకరమైన వార్త వినడం మరింత సంతోషంగా ఉంది. చిరంజీవి సార్, మీరు తాత అనే ప్రతిష్టాత్మక బిరుదుతో కూడా ఎవర్ గ్రీన్ హీరో అని పించుకుంటారు అని ఆమె అన్నారు. ఉపాసన కొణిదెల & మీ ఇంటి చిన్న మహాలక్ష్మికి నా ఆశీస్సులు ఆమె క్షేమం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తా అంటూ ఆమె రాసుకొచ్చారు.

Show comments