Site icon NTV Telugu

Mike Tyson: ఫ్లైట్ లో ప్రయాణికుడి ముఖం పగలగొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్

Mike

Mike

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో బంధించాడు. అంతేకాకుండా మైక్ సీట్ వెనుక నిలబడి వీడియో తీస్తూ మైక్.. మైక్ అని అరవడం మొదలుపెట్టాడు.

పలుమార్లు ఆ యువకుడిని మాట్లాడింది చాలు.. నిశబ్దంగా కూర్చొమని మైక్ చెప్పినా వినకుండా సదురు వ్యక్తి ఇంకా మైక్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టైసన్.. అతగాడిపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ వ్యక్తి ముఖం పగిలింది. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మైక్ టైసన్ కి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది మరి.. మైక్ టైసన్ కి చిరాకు తెప్పించే ప్రాంక్ చేసాడేమో.. అది కాస్త రివర్స్ అయ్యింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version