Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Movie OTT: ప్రపంచ సంగీత చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి అరుదైన లెజెండ్స్‌లో మైఖేల్ జాక్సన్ పేరు ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్, వినూత్నమైన మ్యూజిక్ స్టైల్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించకుని ఆయన సంగీత ప్రపంచాన్నే పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు ఆ మహానుభావుడి జీవిత ప్రయాణాన్ని తెరపై ఆవిష్కరించిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘మైఖేల్’ సినిమా ప్రారంభంలో మిక్స్డ్ టాక్ తో నడిచినప్పటికీ, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ బయోపిక్‌ను విశేషంగా ఆదరించారు. ముఖ్యంగా మైఖేల్ జాక్సన్ అభిమానులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, భారతీయ కరెన్సీలో సుమారు 7,100 కోట్ల రూపాయల కలెక్షన్లతో గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 9 నుంచి బుక్‌మైషో స్ట్రీమ్ వేదికగా ‘మైఖేల్’ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. మొదట ఈ చిత్రం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి రానుండగా, అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి వేదికల్లో కూడా రెంటల్ ప్రాతిపదికన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ బయోపిక్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం. మైఖేల్ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ప్రెజెన్స్, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన డ్యాన్స్ స్టెప్స్‌ను జాఫర్ అద్భుతంగా చేశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. తెరపై ఆయనను చూసిన అభిమానులు చాలా సందర్భాల్లో నిజంగానే మైఖేల్ జాక్సన్‌ను చూస్తున్న అనుభూతిని పొందినట్లు సోషల్ మీడియాలో స్పందించారు. సినిమాలో నియా లాంగ్, జూలియానో వాల్డి వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించగా, ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సంగీత ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ప్రభావం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కింగ్ ఆఫ్ పాప్’గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పటికీ కొత్త తరాలకు ప్రేరణగా నిలుస్తున్నారు. అందుకే ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. థియేటర్లలో మిస్ అయిన భారతీయ ప్రేక్షకులకు ఇప్పుడు డిజిటల్ వేదికల ద్వారా ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభిస్తోంది. సంగీతాన్ని ప్రేమించే వారికైనా, మైఖేల్ జాక్సన్ అభిమానులకైనా, ఒక గొప్ప కళాకారుడి జీవితం ఎలా విజయాలతో పాటు సవాళ్లతో నిండిపోయిందో తెలుసుకోవాలనుకునే వారికైనా ‘మైఖేల్’ ఒక ఆసక్తికరమైన సినీ అనుభవంగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..