Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musical Drama : మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని తాకే కథలతో మలయాళ చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం మలయాళంలో విడుదలై ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఒక ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ఇప్పుడు తెలుగులో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషి జీవితంలో కొన్ని మంచి క్షణాలు ఎంత అందంగా ఉంటాయో అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా అలాంటి జీవితమే. అయితే కొన్ని సార్లు ఊహించని విధంగా విధి జీవితాన్ని ఆడుకుంటుంది. నిన్నటి వరకు నవ్వులతో, కలలతో, ఆత్మవిశ్వాసంతో నిండిపోయిన జీవితం… ఒక్క క్షణంలో చీకట్లోకి జారిపోతుంది. కానీ ఆ చీకట్లో కూడా మళ్లీ వెలుగు నింపుకోవడమే నిజమైన జీవితం అని గుర్తు చేసే ఎమోషనల్ స్టోరీనే ఈ ‘మేరీ ఆవాజ్ సునో’ సినిమా.
‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్
ఈ మలయాళ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా ‘మేరీ ఆవాజ్ సునో’ కూడా ఇప్పుడు ప్రేక్షకుల మనసులను తాకే సినిమాగా మారుతోంది. 2022లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మే 27 (ఈ రోజు) నుంచి ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్'(ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆర్జే శంకర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో జయసూర్య అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. డాక్టర్ రేష్మిగా మంజు వారియర్ మరోసారి తానేంటో నిరూపించింది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు తొలిసారి కలిసి నటించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరితో పాటు శివద, జానీ ఆంటోని, గౌతమి నాయర్, సుధీర్ కరమణ వంటి నటీనటులు కూడా కథను బలంగా నిలబెట్టారు. 2019లో విడుదలై ప్రశంసలు అందుకున్న బెంగాలీ చిత్రం ‘కంటో’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజేష్ సేన్ దర్శకత్వం వహించగా, బి. రాకేష్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
ఈ సినిమా కథ ఏమిటంటే
ఈ కథ మొత్తం శంకర్ అనే ఒక రేడియో జాకీ చుట్టూ తిరుగుతుంది. తన గొంతుతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న శంకర్‌కు ఆ వాయిస్ ఒక ప్రపంచం. అతని మాటలు వినేందుకు ప్రజలు కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి సమయంలో అతనికి లారింజియల్ క్యాన్సర్ ఉందని తెలిసిపోతుంది. చికిత్స కోసం అతని గొంతు శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రేడియో జాకీకి గొంతు అంటేనే జీవితం. అలాంటి జీవితమే ఒక్కసారిగా ముగిసిపోయిందని భావించిన శంకర్ తీవ్ర నిరాశలో కూరుకుపోతాడు. తాను ఇక పనికిరానివాడిననే ఆలోచన అతన్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తుంది.
అక్కడి నుంచే కథ ఓ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ రేష్మి అతని జీవితంలోకి రావడం, ఓడిపోయాననుకున్న ఆ మనిషిలో మళ్లీ ఆశ చిగురించడంతో సినిమాను చూసే ఆడియన్స్ లో కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి. జీవితంలో అన్నీ ముగిసిపోయాయని అనుకునే ప్రతి వ్యక్తికి ఈ కథ ఒక చిన్న ధైర్యం ఇస్తుంది. ముఖ్యంగా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి తిరిగి ఎలా నిలబడగలడో ఇందులో చాలా ఎమోషనల్ గా చూపించారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!