Site icon NTV Telugu

Rajamouli: మేరా భారత్ మహాన్… ఇదే మాట ఆ స్టేజ్ పైన చెప్పండి జక్కన్న

Rajamouli Rrr

Rajamouli Rrr

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది మన ఆర్ ఆర్ ఆర్ సినిమా.రేస్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రీసెంట్ గా ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్’లో రెండు అవార్డ్స్ ని గెలుచుకుంది. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా అవార్డులని గెలుచుకుంది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి అవార్డ్ రావాల్సి ఉంది కానీ అది అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీకి వెళ్లింది. అవతార్ 2 సినిమాకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే రేంజులో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంది అంటే రాజమౌళి మన సినిమా స్థాయిని ఎంత పెంచాడో, ఎంత దూరం తీసుకోని వెళ్ళాడో అర్ధం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకున్న తర్వాత రాజమౌళి స్టేజ్ ఎక్కి ఇచ్చిన స్పీచ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కీరవాణి వైఫ్ మరియు రాజమౌళికి తల్లి లాంటి వల్లి గారి గురించి, రమారాజమౌళి గురించి ప్రపంచ వేదికపై మాట్లాడిన రాజమౌళి. తన స్పీచ్ ని ముగిస్తూ ‘మేరా భారత్ మహాన్’ అని ఒక విక్టరీ రోర్ చేశాడు.

ఇదే విక్టరీ రోర్ ని, ఇదే మేరా భారత్ మహాన్ అనే మాటని ఆస్కార్ వేదికపైనే, ఆస్కార్ అవార్డ్ గెలుచుకోని రాజమౌళి ప్రపంచ సినీ మేధావుల ముందు నిలబడి చెప్పాలి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్టర్ ఇలా ఏ కేటగిరిలో అయినా సరే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అందుకోని, ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఇండియాకి తీసుకోని వస్తుందేమో చూద్దాం. ఇదిలా ఉంటే రాజమౌళి ‘క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్’ గెలుచుకున్న తర్వాత ఇచ్చిన స్పీచ్ గురించి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ట్వీట్ చేస్తూ… “It’s a huge honour n Pride for us,BHARATH n our TELUGU language .. big congratulations to Rajamouli garu,Keeravanigaru,ramagaru,valligaru n Vijayendra Prasad garu n the TEAM .. hats off” అంటూ కోట్ చేశారు. బాలీవుడ్ వర్గాల్లోని కొంతమంది మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధిస్తున్న విజయాల గురించి పెద్దగా స్పందించట్లేదు.

Exit mobile version