Site icon NTV Telugu

Menakshi Chaudhary : ట్రెడిషనల్ వేర్ లో అదరగొట్టిన ఖిలాడి భామ..

Whatsapp Image 2023 07 17 At 2.49.33 Pm

Whatsapp Image 2023 07 17 At 2.49.33 Pm

మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.ఈ భామ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమా లో నటించి మెప్పించింది. ఖిలాడి సినిమాలో ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు తెగ ఫిదా అయిపోయారు..కానీ ఖిలాడి సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ తరువాత అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమా లో నటించింది. ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో అదరగొట్టింది.గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. హిట్ 2 విజయం తర్వాత మీనాక్షి చౌదరికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం లో ఛాన్స్ కొట్టేసింది.

ఈ భామ విజయ్ ఆంటోని నటించిన హత్య సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూలై 21న రిలీజ్ అవుతోంది..ఈ సందర్బం గా ఆదివారం రోజున గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.బ్లూ కలర్ లంగా ఓణీలో మీనాక్షి చౌదరి మెరిసింది.ట్రేడిషనల్ వేర్ లో కనిపించి కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృష్టించింది ఈ భామ..సాంప్రదాయ వస్త్ర ధారణ లో కూడా మీనాక్షి తన క్లీవేజ్ చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది.ఆమె అందాలను పొగుడుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీనాక్షి..మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం గురించి మాట్లాడింది. నేను మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ అని గుంటూరు కారం చిత్రంలో అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూట్ కూడా అయిపోయిందని తెలిపింది..

Exit mobile version