NTV Telugu Site icon

Naresh Agastya: ‘#మెన్ టూ’ రిలీజ్ డేట్ మారింది!

Men Too

Men Too

#Men too: లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి. రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘#మెన్ టూ’. ఈ సినిమాను మౌర్య సిద్ధ‌వ‌రం నిర్మిస్తున్నారు. నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, కౌశిక్ ఘంట‌శాల‌, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 5న విడుదల కావాల్సింది. అయితే.. ఇప్పుడీ తేదీని మే 26కు మార్చారు. ఈ సందర్భంగా నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ, “‘#మెన్ టూ’ అనేది ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఎంట‌ర్‌టైన్మెంట్ ప‌రంగా ఫుల్ మీల్స్‌లాంటి సినిమా ఇది. మంచి టీమ్ చేసిన ప్ర‌య‌త్నం. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి. రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాతో ఎవ‌రినో బాధ పెట్టాల‌నే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. ఓ విష‌యాన్ని ఒకే కోణంలో కాకుండా మ‌రో కోణంలో కూడా చూడాల‌ని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా దీనిని రూపొందిస్తున్నాం. మే 26న భారీగా సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఎలిషా ప్రవీణ్, ఓషో వెంకట్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. మాటలు, పాటలు రాకేందు మౌళి అందించారు.

Show comments