NTV Telugu Site icon

Mem Famous Trailer: బర్త్ డే నాడు ఎవడైనా కేక్ కట్ చేయిస్తాడు… కల్లు తాపిస్తాడా?

Mem Famous

Mem Famous

Mem Famous Trailer:సుమంత్ ప్రభాస్, మణి ఎగుర్ల, మౌర్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక హీరోగా నటించిన సుమంత్ ప్రభాసే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో పిల్ల పిల్లగాడు అనే వెబ్ సిరీస్ తో సుమంత్.. మంచి పేరునే తెచ్చుకున్నాడు. ఇక ఈ సిరీస్ తరువాత.. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన సుమంత్.. మొదటి సారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఒక ఎత్తు అయితే.. వీరు చేసిన ప్రమోషన్స్ ఇంకో ఎత్తు.. స్టార్ సెలబ్రిటీలందరితోనూ గట్టిగా ప్రమోషన్స్ చేయించారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి.. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

ట్రైలర్ ఆద్యంతం క్రేజీ రైడ్ గా కనిపిస్తోంది. ముగ్గురు స్నేహితులు.. పనిపాటా లేకుండా ఊరు మీద పడి తిరుగుతూ ఉంటారు. వారిని ప్రేమించిన అమ్మాయిలు.. ఇక ఉద్యోగం లేకపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు వారిని కొట్టడం.. ప్రేమించిన అమ్మాయిలను సొంతం చేసుకోవడానికి.. వీరు ఫేమస్ అవ్వడానికి రెడీ అవుతారు. దానికోసం వారిలో ఉన్న ఇన్నర్ ట్యాలెంట్ ను బయటకు తీస్తారు. అలా వారు చివరికి ఏం సాధించారు..? ప్రేమించిన వారిని దక్కించుకున్నారా..? లేదా..? అనేది కథగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎంతోమంది యువత..ఇదే తీరుగా ఉంటున్నారని పెద్దలు అంటున్నారు.. కానీ, సమయం వచ్చినప్పుడు తామెంటో చూపిస్తామని యువత చెప్పుకొస్తుంది. యువతను తక్కువ అంచనా వేయకండి.. వారు అనుకుంటే.. ఏదైనా సాధిస్తారు అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

హీరోగా సుమంత్ బాగానే సెట్ అయ్యినట్లు కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ వాయిస్ లానే అతని వాయిస్ కూడా ఉండడంతో సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక డైలాగ్స్ అయితే మస్త్ న్యాచురల్ గా ఉన్నాయి. ఇంట్లో, దోస్త్ లతో ఎలా మాట్లాడుకుంటారో .. అలాగే ఉన్నాయి. ముఖ్యంగా బర్త్ డే నాడు ఎవడైనా కేక్ కట్ చేయిస్తాడు… కల్లు తాపిస్తాడా? అని హీరోయిన్ అడగడం.. నేను తాపిస్తా అని హీరో చెప్పడం క్రేజీగా ఉంది. ఇకపోతే ఈ సినిమా మే 26 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది . చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీగా హిట్ అందుకున్న రైటర్ పద్మభూషణ్, మేజర్ మేకర్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.