టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఈ మధ్యనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి చేసుకొని సెట్ అవుదామనుకునే లోపే లాక్ డౌన్ అమలులోకి రావడంతో పెళ్లి వాయిదా వేసుకుంది. దీంతో మెహ్రీన్ పరిస్థితులన్నీ చక్కబడ్డాకనే పెళ్లి అంటూ ఈమధ్యనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేద్దాం అనుకొనే లేపే.. నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో మెహ్రీన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ లో నటిస్తున్న ఈ బ్యూటీ.. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న వెబ్ సిరీస్ లోను నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా బాలయ్య సినిమా ఆఫర్ కూడా రావడంతో మరోసారి తన పెళ్లి వాయిదా వేసుకోనుందనే ప్రచారం జరుగుతోంది.
బాలయ్య కోసం.. మెహ్రీన్ పెళ్లి వాయిదా!
