NTV Telugu Site icon

Mehar Ramesh: ఓ శక్తి.. ఓ షాడో.. ఓ భోళా.. స్టార్స్ కు ప్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే

Mehar

Mehar

Mehar Ramesh: మెహర్ రమేష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇతని పేరే వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో టాలీవుడ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత మెహర్ కన్నడ పరిశ్రమపై కన్ను వేశాడు. ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలను కన్నడలో రీమేక్ చేసి భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక కన్నడ లో రెండు హిట్లు పడ్డాకా మళ్ళీ టాలీవుడ్ లో ఎన్టీఆర్ తో కంత్రీ చేశాడు. ఇది ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తరువాత ప్రభాస్ తో బిల్లా సినిమాను తెరకెక్కించాడు. డాన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్రభాస్ కెరీర్ లోనే అంత స్టైలిష్ గా కనిపించింది బిల్లాలోనే అని చెప్పొచ్చు. ఇక వరుసగా శక్తి, షాడో లాంటి సినిమాలు చేశాడు. అవి అయితే డిజాస్టర్లు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వెంకటేష్ కెరీర్ లోనే ది వరస్ట్ సినిమా అంటే షాడో అంటారు ఆయన అభిమానులు. అంత డిజాస్టర్ అందుకున్నాకా.. మెహర్ డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చాడు.

Chiranjeevi: ఖుషీ నడుము సీన్.. పవన్ పరువు తీశావ్ గా బాసూ

2013 లో షాడో కు దర్శకత్వం వహించిన మెహర్.. దాదాపు 10 ఏళ్ళ తరువాత భోళా శంకర్ తో మరోసారి డైరెక్టర్ మైక్ అందుకున్నాడు. దాదాపు పదేళ్లు డైరెక్షన్ ఛాన్స్ రాలేదు అని కొందరు అంటూ ఉంటారు. అయితే చిరుకు మెహర్ దగ్గర బంధువు. దీంతో ఆయనే మెహర్ కు ఛాన్స్ ఇచ్చాడు. తమిళ్ లో వేదాళం హక్కులను మొదట ఏఎం రత్నం కొనుగోలు చేయడం.. పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ చేయాలనుకోవడం కూడా జరిగాయి. అయితే కొన్ని కారణాలు వలన ఈ సినిమా చిరు చేతికి చిక్కింది. ఎంతోమంది డైరెక్టర్స్ చేతులు మారుతూ చివరికి మెహర్ చేతికి వచ్చింది భోళా శంకర్. చిన్నతనం నుంచి చిరుకు పెద్ద ఫ్యాన్ అయిన మెహర్ ఈ ఛాన్స్ ను వదులుకోవాలనుకోలేదు. వెంటనే భోళాను పట్టాలెక్కించాడు. చిరును ఎవరు చూపించినట్లు చూపిస్తాను అని చెప్పి చివరికి ఇలా చిరుకు కూడా డిజాస్టర్ ను అందించాడు అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెహర్ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. ఓ శక్తి.. ఓ షాడో.. ఓ భోళా.. స్టార్స్ కు ప్లాప్స్ ఇవ్వడంలో తోపు అంతే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా తరువాత మెహర్.. డైరెక్టర్ గా కొనసాగుతాడా.. ? లేదో చూడాలి.