NTV Telugu Site icon

Chiru: మీ స్వాగ్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్…

Chiru

Chiru

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అద్భుతంగా చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోస్ అందరూ చాలా మంచి డాన్సర్స్. అయితే ఎవరు ఎన్ని చేసినా స్వాగ్, గ్రేస్ విషయంలో మెగాస్టార్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్ అనే చెప్పాలి. ఆయన డాన్స్ అద్భుతంగానే కాదు అందంగా వేస్తాడు, అందుకే చిరు మిగిలిన హీరోలకన్నా చాలా స్పెషల్. ఏజ్ తో సంబంధం లేదు, ఆయన డాన్స్ వేస్తే ఆడియన్స్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది వాల్తేరు వీరయ్య సినిమాలోని డోంట్ స్టాప్ డ్యాన్సింగ్, వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్స్… ఈ రెండు పాటలు మెగా అభిమానులకే కాదు తెలుగు సినీ అభిమానులందరికీ కిక్ ఇచ్చాయి. లేటెస్ట్ గా చిరు డాన్స్ గ్రేస్ ని ఒక చిన్న స్టెప్ తోనే చూపిస్తూ భోళా మేనియా సాంగ్ ప్రోమో బయటకి వచ్చింది. ఈరోజు సాయంత్రం భోళా మేనియా ఫుల్ సాంగ్ బయటకి రానుంది, ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపిస్తూ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. చిరు ఈ ప్రోమోలో సూపర్ ఉన్నాడు. ఒక పదేళ్ల క్రితం చిరు ఎలా ఉన్నాడో ఈ ప్రోమోలో అచ్చం అలానే ఉన్నాడు.

ఈ సాంగ్ తో మెగా ఫెస్టివల్ ని  స్టార్ట్ చేయడానికి మహతి స్వర సాగర్ రెడీగా ఉన్నాడు. ఆ స్టైల్ అండ్ స్వాగ్ ఎన్ని ఏళ్లు అయినా మెగాస్టార్ నుంచి పోదనే మాటని నిజం చేసేలా ఈ ప్రోమో ఉంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ భోళా మేనియా సాంగ్ లో సూపర్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఆ టాక్ ని ఈ ప్రోమో ప్రూవ్ చేసింది. మరి శేఖర్ మాస్టర్ స్టెప్స్, చిరు గ్రేస్, మహతి స్వర సాగర్ కంపొజిషన్ అన్నీ కలిసి ‘భోళా మేనియా’ సాంగ్ ని ఎంత స్పెషల్ గా మార్చనున్నాయో చూడాలి. తమిళ వేదాలమ్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 11న రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘భోళా మేనియా’ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు.