కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా కూడా పవన్ కళ్యాణ్ కి అన్న అంటే ఎంతో ఇష్టం. తనకి తెలిసిన ఒకే ఒక్క స్టార్ హీరో చిరంజీవి మాత్రమే అని ఎప్పుడూ చెప్తుంటాడు పవన్ కళ్యాణ్. చిరుకి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పేరుకి తమ్ముడే అయినా చిరు పవన్ ని సొంత కొడుకులా భవిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో… మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి విషెస్ చెప్తూ మెగా బ్రదర్స్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. నాగ బాబు, చిరు, పవన్ కళ్యాణ్ ఉన్న ఈ ఓల్డ్ ఫోటోని ఇప్పుడు మెగా ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. “Dearest Kalyan Babu, జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు!
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday… pic.twitter.com/pkry6DtwGA
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2023
