మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం జగన్ ఇస్తారని నమ్మకంగా చెప్పిన చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు. ” సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా జగన్ గారు నిర్ణయం తీసుకొంటామన్నారు.. అప్పటివరకు సినిమా రంగంలోని వారు సమన్వయం పాటించాలి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ వాళ్ళకు నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ పెద్దగా కాదు బిడ్డగా చెప్తున్నాను. ఇండస్ట్రీ వాళ్ళు కానీ, థియేటర్ల తరపున వారికి.. యావన్మందికి ఒక వ్యక్తిగా నేను తెలియజేసుకొంటున్నాను. అనవసరంగా మీ కోపంతోటి, ఆందోళనతోటి ఎవరుపడితే వాళ్లు స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, మాటలు జారడం కానీ చేయవద్దు. పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని అనే నమ్మకం నాకు ఉంది. నా మాటను మన్నించి మీరందరు సమన్వయం పాటించాలని కోరుతున్నాను. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఎవరు మాట్లాడొద్దు” అని తెలిపారు. ఇక ఈ ఇష్యూపై టాలీవుడ్ స్టార్ హీరోలు పలువురు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా, మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.