NTV Telugu Site icon

Chiranjeevi: మెగా తుఫాన్… మూడోసారి వంద కోట్లు

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వంద కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది. ఒక నాన్ స్టార్ డైరెక్టర్ తో చిరు రాబడుతున్న కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. A టు C  సెంటర్ తో సంబంధం లేకుండా చిరు చేస్తున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూస్తుంటే యంగ్ స్టార్ హీరోల అభిమానులు కూడా అవాక్ అవుతున్నారు. ఇది కదా మెగాస్టార్ స్టామినా అంటూ మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. చిరు వంద కోట్ల షెట్ రాబట్టడం ఇదే మొదటిసారి కాదు, తన రీఎంట్రీ తర్వాత మొదటిసారి ఖైదీ నంబర్ 150 సినిమాతో చిరు వంద కోట్ల షేర్ ని రాబట్టాడు. ఆ తర్వాత సైరా సినిమాతో మరోసారి 100 షేర్ కి కలెక్ట్ చేశాడు.

ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా అభిమానులు కాస్త డిజప్పాయింట్ అయ్యారు కానీ ఈసారి అందరికీ ఫుల్ మీల్స్ పెడుతూ చిరు వంద కోట్లు రాబట్టాలి అంటే యావరేజ్ సినిమా చాలు అని ప్రూవ్ చేసింది వాల్తేరు వీరయ్య సినిమా. ఓవర్సీస్ లో కూడా 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాల లిస్టులో చిరువి మూడు సినిమాలు ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బయ్యర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ ఇస్తోంది. ఈ మెగా సక్సస్ ని ఎంజాయ్ చేస్తూ ఓవర్సీస్ లో మెగా ఫాన్స్ స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. మెగా వాచ్ పార్టీ అంటూ ఒకేసారి, ఒకేరోజు నార్త్ అమెరికాలోని 25 సిటీస్ లో వాల్తేరు వీరయ్య స్పెషల్ షోస్ వేస్తున్నారు. మెగా ఫాన్స్ పూనకాలు రిపీటింగ్ అంటూ ఈ మెగా వాచ్ పార్టీని ఎంజాయ్ చెయ్యబోతున్నారు.

Mega Watch Party