Site icon NTV Telugu

Chiru: ‘వీరయ్య’ సింగల్ గానే వస్తాడా?

Chiru Vs Balayya

Chiru Vs Balayya

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య జరగనున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కుతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో మేకర్స్ సినీ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగున్న చిరు, బాలయ్యల బాక్సాఫీస్ ఫైట్ కి ఫాన్స్ మరోసారి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి వార్ ని బాలయ్య జనవరి 12న మొదలుపెడుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఫ్యాక్షన్ జానర్ లో రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జనవరి 12న, ఓవర్సీస్ లో జనవరి 11న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బాలయ్య హిట్ కొడతాడని నందమూరి అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

చాలా కాలం తర్వాత మాస్ గెటప్ లో కనిపిస్తూ మెగాస్టార్ నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’పై మెగా అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. బాలయ్య జనవరి 12కి ఫిక్స్ అయ్యాడు కాబట్టి, చిరు అంతకన్నా ముందే జనవరి 9న రానున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. మరికొంతమందేమో చిరు జనవరి 14న పండగ రోజునే థియేటర్స్ లోకి వస్తాడని అనుకుంటున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమైన బాక్సాఫీస్ దగ్గర చిరు సోలోగానే ఎంట్రీ ఇస్తాడు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ‘అజిత్’ నటిస్తున్న ‘తునివు’ సినిమా నుంచి పోటీ ఎదురుకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘తునివు’ కూడా జనవరి 14నే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగులో అజిత్ కి అంత మార్కెట్ లేదు కానీ ‘కంటెంట్’ బాగుంటే ఆ సినిమాని ఆదిరంచడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు కాబట్టి ‘తునివు’ టాక్ బాగుంటే తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది.

Exit mobile version