Site icon NTV Telugu

ముగిసిన చిరు అప్డేట్ల పర్వం.. ఆర్డర్ పై ఓ లుక్కేద్దాం!

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించబోయే చిత్రాల సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను చిరు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య (చిరు 152) సినిమాను పూర్తి చేసిన చిరు.. విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి.

చిరు 153 – గాడ్ ఫాదర్:
చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రాన్ని మోహన్‌ రాజా డైరెక్ట్ చేయనున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్‌’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చిరు 154 – బాబీతో సినిమా
చిరు 154 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా, బాబీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.

చిరు 155 – బోళా శంకర్‌
చిరు 155వ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదాళం’ కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదే క్రమంలో తాజాగా అన్న – చెల్లెలి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ భోళా శంకర్ చిత్రంలో ఆయన చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Exit mobile version