NTV Telugu Site icon

Megastar Tweet: మై డియర్ దేవా… బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్ కంగ్రాట్స్

Megastar Tweet

Megastar Tweet

చిన్న సినిమాలు వచ్చినా, మంచి సినిమా అనే టాక్ వస్తే దాని గురించి ట్వీట్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అలవాటు. తన సినిమానా, తన ఫ్యామిలీ సినిమానా అనేది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో నుంచి గుడ్ కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా స్పందించేది హీరో చిరంజీవి. డిసెంబర్ 22న రిలీజైన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ కి ముందు ఉన్న హైప్ కి న్యాయం చేస్తూ సూపర్ హిట్ టాక్ తో సలార్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో చిరు Xలో సలార్ గురించి ట్వీట్ చేసాడు.

“Heartiest Congratulations my dear ‘Deva’ #RebelStar  has put the Box Office on Fire Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building. My love to the Superb ‘Varadaraja Mannar’ PrithviOfficial, ‘Adya’ shrutihaasan and ‘Kartha’ IamJagguBhai And The fantastic crew of bhuvangowda, RaviBasrur, vchalapathi_art, anbariv, Producer VKiragandur and the entire team of SalaarTheSaga & hombalefilms on this stupendous success!” సలార్ కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కంగ్రాట్స్ చెప్పాడు చిరు. బాక్సాఫీస్ కి సెగలు పుట్టించావ్, కంగ్రాట్స్ దేవా అంటూ చిరు చేసిన ట్వీట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ రీట్వీట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ దెబ్బకి ఎలాంటి రికార్డులు లేస్తాయే చూడాలి.

Show comments