Site icon NTV Telugu

Chiranjeevi : మాఫియా డాన్‌గా మెగాస్టార్

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలను లైన్లో పెట్టడమే కాదు షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవల వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఈ చిత్రం వచ్చే నెలలో అధికారికంగా లాంచ్ కానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగే ఈ చిత్రంలో మెగాస్టార్ మాఫియా డాన్‌గా నటిస్తున్నారు. మెగాస్టార్ పాత్ర ఉల్లాసమైన వినోదంతో కూడి ఉంటుందట.

Read Also : BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్

వెంకీ కుడుముల ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. చిరంజీవి ప్రస్తుత ప్రాజెక్ట్‌లు అన్నీ పూర్తయ్యాక 2023 రెండవ భాగంలో ఈ చిత్రం తెరపైకి వస్తుంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి నటించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి దాదాపుగా 5 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Exit mobile version