Mega Princess: మెగా ప్రిన్సెస్ కి గ్రాండ్ వెల్కమ్…

Mega Princess

Mega Princess

మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. రామ్ చరణ్, ఉపాసనలకి పాప పుట్టడంతో అందరిలోనూ సంతోషం ఉప్పొంగుతోంది. 2012 జూన్ 14న ఉపాసన-రామ్ చరణ్ ల పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు దశాబ్దం తర్వాత అందరిలోనూ హ్యాపీనెస్ నింపుతూ బేబీని గిఫ్ట్ గా ఈ ప్రపంచంలోకి తెచ్చారు. అపోలో హాస్పిటల్ లో పాపకి జన్మనిచ్చిన ఉపాసనని చూడడానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, మెగా అభిమానులు పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్ చేరుకున్నారు. మెగా ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ వస్తుండడంతో మెగా స్టార్ చిరంజీవి… తాత అయిన సంతోషంలో ట్వీట్ చేసాడు.

ఇటీవలే మెగా ఫ్యామిలీ లోకి ఎంటర్ అయిన లావణ్య త్రిపాఠి కూడా తన హ్యాపినెస్ ని షేర్ చేసుకుంది.

మెగా అభిమానులు కూడా ట్వీట్స్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో #Megaprincess టాగ్ ట్రెండ్ అవుతోంది.