Site icon NTV Telugu

Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ సన్మానం..

Chiru

Chiru

Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్ కు పిలిచి సన్మానించారు. రీసెంట్ గా ఆసియా కప్ ట్రోఫీలో పాకిస్థాన్ పై సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను గెలిపించాడు తిలక్. దాంతో దేశ వ్యాప్తంగా తిలక్ పేరు మార్మోగిపోయింది. ఎందుకంటే పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ తో శత్రుత్వం మరింత పెరిగింది. ఇలాంటి టైమ్ లో జరిగిన మ్యాచ్ కాబట్టి అంతా ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని కోరుకున్నారు. ఓడిపోతుందేమో అనుకున్న మ్యాచ్ లో తిలక్ వర్మ అదిరిపోయే బ్యాటింగ్ చేసి గెలిపించాడు. అప్పుడే దేశమంతా అతన్ని ప్రశంసించింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తిలక్ ను ప్రశంసించారు.

Read Also : Bigg Boss 9 : హౌస్ మేట్స్ పై నోరు పారేసుకుంటున్న మాధురి.. మరీ ఇలా ఉందేంటి..?

తాను నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సెట్స్ కు తాజాగా తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ ను చిరంజీవి గజమాలతో సత్కరించారు. కేక్ కట్ చేయించి అభినందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మతో చాలా సరదాగా మాట్లాడారు చిరు. తన సినిమా టీమ్ మొత్తాన్ని పరిచయం చేసి అందరితో కాసేపు మాట్లాడించారు. ప్రతిభావంతులను తన వద్దకు పిలిపించుకుని సన్మానించి వారిని ప్రశంసించడం చిరంజీవికి అలవాటే. గతంలో పీవీ సింధును కూడా ఇలాగే ప్రశంసించారు. ఇప్పుడు తిలక్ వర్మకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Brahmanandam : ఆయన వల్ల స్టేజిపైనే ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?

Exit mobile version