Megastar Chiranjeevi Gives Clarity on Boss Party Song Issue: వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాస్ పార్టీ’ పాట చిత్రీకరణ సమయంలో.. మెగాస్టార్ చిరంజీవి కొంచెం అసంతృప్తి చెందారని, యూనిట్ వర్గాలపై ఫైర్ అయ్యారని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్‌గా ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో.. చిరుకి ఆ గొడవకి సంబంధించి ప్రశ్న ఎదురైంది. తొలుత ఈ ప్రశ్న ఎదరైనప్పుడు చిరునవ్వులు చిందించిన చిరు, ఆ తర్వాత తానెందుకు ఆ సమయంలో కాస్త ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చిందో స్పష్టతనిచ్చారు.
IND vs NZ Match: ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. విడతల వారీగా విక్రయాలు.. అజారుద్దీన్ స్పష్టం
చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘బాస్ పార్టీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ వేసిన సెట్ నన్ను మైమరిచిపోయేలా చేసింది. ఎంతలా అంటే, అతడ్ని పొగుడుతూ ఒక ట్వీట్ కూడా చేశాను. సాధారణంగా నాకు సెట్ నచ్చితే, అప్పటికప్పుడే వాళ్లని ప్రశంసించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేస్తాను. కానీ.. ప్రకాశ్ విషయంలో మాత్రం నేను ట్వీట్ వేశానంటే, అది ఎంతలా నన్ను ఆకట్టుకుందో మీరే అర్థం చేసుకోండి. అయితే.. ఆ సెట్‌ని అవసరానికి మించి చేశారన్న భావన కలిగింది. ఎక్కడో కో-ఆర్డినేషన్ మిస్ అయ్యింది. బాబీతో నేను కలిసి ఇతర యూనిట్‌తో బిజీగా ఉంటే, అప్పటికే బాస్ పార్టీకి ఎలాంటి సెట్ వేస్తే వర్కౌట్ అవుతుందని సభ్యులు డిసైడ్ అయ్యారు. కానీ.. ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం ఎంతవరకు సెట్ వేయాలి, ఎంత ఎక్స్‌పోజ్ అవుతుందనేది ఒక చిన్న మీటింగ్ అనేది నిర్వహించుకోలేదు. అదే ఈ సినిమాలో జరిగిన చిన్న మిస్టేక్’’ అని చెప్పుకొచ్చారు.
Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్య.. ఆ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్
పరిమితికి మించి సెట్ వేయడం వల్ల.. ఇంత పెద్ద సెట్ అవసరమా? అని తాను ప్రశ్న సంధించానని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అదే ఆరోజు సెట్‌లో జరిగిన వ్యవహారమని, అంతకుమించి గొడవలేమీ జరగలేదని వెల్లడించారు. సెట్ ఎంత పెద్దది వేసినా, నిర్మాతలు ఎలాగోలా దాన్నుంచి లాభాలు పట్టుకొస్తారని, ఇతర సినిమాల్లో వాటిని వినియోగిస్తారని, కానీ కేవలం బాస్ పార్టీ పాట కోసం మాత్రమే అంత పెద్ద సెట్ వేయడం వల్ల ‘అంత అవసరమా’ అని తనకు అనిపించిందని చిరు తెలిపారు.
Road Accident: టీ స్టాల్ వద్ద ఉన్న జనాలపైకి దూసుకొచ్చిన ట్రక్కు.. ఆరుగురు బలి