NTV Telugu Site icon

Chiru: ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళొస్తా… రిటర్న్ వచ్చాక రచ్చ చేద్దాం

Chiru

Chiru

వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మెగా స్టార్ చిరంజీవి, అన్నయ్య స్ట్రెయిట్ సినిమా చేస్తే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపిస్తదని నిరూపించారు మెగా ఫాన్స్. ఈసారి  ఆ హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తూ చిరు మరో స్ట్రెయిట్ మూవీ చేస్తాడు అనుకుంటే తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భోళా శంకర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ మధ్య రిలీజ్ చేసిన ‘భోళా మేనియా’ అనే ఫస్ట్ సింగిల్‌లో మెగాస్టార్ తనదైన స్టెప్పులతో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా.. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి… థియేటర్స్ లో కలుద్దాం అని ట్వీట్ చేశారు మెగాస్టార్.

ఇక భోళా శంకర్‌ డబ్బింగ్ కంప్లీట్ అవడంతో.. ఫారిన్ ట్రిప్‌కు వెళ్లిపోయారు మెగాస్టార్. సురేఖతో కలిసి షార్ట్ హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నాను.. తిరిగొచ్చాక నెక్స్ట్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతానని అన్నారు. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. ఈ సినిమా ఒక్క ఫైట్ కానీ విలన్ గాని లేకుండా… మెగాస్టార్ మార్క్‌ తో హిలేరియస్‌గా రాబోతోంది. ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.