NTV Telugu Site icon

Dasara: చిరు దెబ్బకి దసరా డైరెక్టర్ వీణ స్టెప్ వేస్తున్నాడు…

Dasara

Dasara

మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా దసరా. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన ఈ మూవీకి మూవీ లవర్స్ నుంచి ఫిల్మ్ ఫెటర్నిటి నుంచీ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నాని యాక్టింగ్ కి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కి, కీర్తి సురేష్ డాన్స్ కి అభినందనలు అందుతూనే ఉన్నాయి. వంద కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్ లో  2 మిలియన్ డాలర్లు, సెకండ్ వీక్ లో కూడా మైంటైన్ చేస్తున్న హోల్డ్ ఇవేమీ ఇవ్వని ఆనందం శ్రీకాంత్ కి ఒక్క ట్వీట్ ఇచ్చినట్లు ఉంది. చాలా రిజసర్వ్డ్ గా ఉండే శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క ట్వీట్ రాగానే ఎగిరిగంతేసాడు.

ఏ సినిమా చూసిన వెంటనే ఆ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించే చిరు, లేటెస్ట్ గా దసరా సినిమా చూసి “బ్రిల్లియంట్ ఫిల్మ్ చేశారు, నాని మేకోవర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగోట్టేసావ్, కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా చేశాడు అనే విషయం ఆశ్చర్యపరిచింది, అతని ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ని అభినందించకుండా ఉండలేము, మహానటి కీర్తి సురేష్ వావ్ అనిపించేలా యాక్ట్ చేసింది, కొత్త కుర్రాడు దీక్షిత్ కూడా బాగా చేశాడు, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ రాకింగ్ గా ఉంది” అంటూ పేరు పేరునా దసరా సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసిన ప్రతి ఒక్కరినీ చిరు స్పెషల్ మేషన్ చేసి మరీ అభినందించాడు. ఈ ట్వీట్ చిరు పోస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల “ఎగురుతున్నా, థాంక్యూ బాస్” అంటూ రిప్లై ఇచ్చాడు. తన చిన్నప్పుడు చిరు ఐకానిక్ స్టెప్ అయిన ‘వీణ స్టెప్’ని వేసిన ఫోటోని కూడా శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. చిరు ట్వీట్ తో శ్రీకాంత్ ఓదెల ఎంత ఎగ్జైట్ అయ్యాడో ఆ ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది.

Show comments