Site icon NTV Telugu

Mega Star: బ్రో కన్నా ముందే భోళా శంకర్ వస్తున్నాడు…

Bhola Shankar

Bhola Shankar

జులై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా మెగా ఫాన్స్ కి ఖుషి చేయడానికి థియేటర్స్ లోకి వస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ జులై 28న పండగ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా రావడం కన్నా ఒక రోజు ముందే జులై 27న  పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిరంజీవి వస్తున్నాడు. అంటే తమ్ముడి కన్నా ముందు అన్నయ్య వస్తున్నాడన్నమాట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ మరో మూడు వారాలే ఉండడంతో మేకర్స్, భోళా శంకర్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసారు.

ఇప్పటికే సాంగ్స్, టీజర్ తో హైప్ పెంచిన చిత్ర యూనిట్ లేటెస్ట్ గా భోళా శంకర్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జులై 27న భోళా శంకర్ ట్రైలర్ బయటకి రాబోతుంది అంటూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. ఈ పోస్టర్ లో చిరు కత్తి పట్టుకోని పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. లుక్ పరంగా చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. జులై 27న భోళా శంకర్ ట్రైలర్ వచ్చి మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తే, అదే జోష్ లో ఫాన్స్ అంతా బ్రో సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్లిపోతారు. సో 48 గంటల పాటు మెగా ఫాన్స్ చిరు-పవన్ కళ్యాణ్ ల మత్తులో నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇది భోళా శంకర్ ట్రైలర్ రికార్డ్స్ అండ్ బ్రో బాక్సాఫీస్ రికార్డ్స్ కి కలిసొచ్చే విషయం.

Exit mobile version