Site icon NTV Telugu

Ahimsa: రామ్ చరణ్ లాంచ్ చెయ్యనున్న ‘అహింస’ ట్రైలర్…

Ram Charan

Ram Charan

దగ్గుబాటి ఫ్యామిలీ మూడో జనరేషన్ నుంచి వస్తున్న హీరో ‘దగ్గుబాటి అభిరాం’. దర్శకుడు తేజ ‘అభిరాం’ని లాంచ్ చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘అహింస’. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ కి ఇప్పటికే కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఇటివలే టీజర్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు. ఈ ప్రమోషన్స్ లో మరింత జోష్ తీసుకోని రావడానికి రామ్ చరణ్ ని రంగంలోకి దించారు. అహింస ట్రైలర్ ని రామ్ చరణ్ జనవరి 12న ఉదయం 11:07కి రిలీజ్ చెయ్యనున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. మరి ఈ ట్రైలర్ అహింస సినిమాపై ఎలాంటి అంచనాలని క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.

Read Also: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్ ఖర్చు ఎంత?

కొత్త వాళ్లతో సినిమా చేసిన సమయంలో దర్శకుడు తేజ దాదాపు హిట్స్ ఇచ్చాడు. తేజ లాంచ్ చేసే హీరో లేదా హీరోయిన్ లో యాక్టింగ్ టాలెంట్ ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. తనకి కావాల్సిన ఎమోషన్ ని ఆర్టిస్ట్ నుంచి తీసుకోవడంలో తేజ దిట్ట అందుకే అతను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్లకి మంచి పేరొస్తుంది. ఇప్పుడు అభిరాంని కూడా తేజ అలానే తీర్చి దిద్ది ఉంటాడు. దగ్గుబాటి లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కాబట్టి టాలెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీకి మరో హీరో దొరికేసినట్లే అవుతుంది.

Read Also: Tollywood: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్

Exit mobile version