సూపర్ టీసర్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో సినిమాపై తన స్పందన తెలియజేశాడు.
ట్విట్టర్ ద్వారా ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. “గల్లా అశోక్.. సినిమా ప్రపంచంలోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చావు.. ‘హీరో’ సినిమాను చూసి పూర్తిగా ఆనందించాను. జయదేవ్ గల్లాగారు, పద్మావతీ గల్లా గారు మరియు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, చిత్ర బృందానికి మొత్తానికి అభినందనలు. మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
