MEGA158 : చిరు – బాబీ సినిమా డీఓపీగా తప్పుకున్న మిరాయ్ దర్శకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళేదుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడట.
Also Read : Exclusive : మహేశ్ – రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
కాగా ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిని తీసుకున్నారు. ఇటీవల మిరాయ్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ ఆ సినిమా సూపర్ హిట్ తో ఈ దర్శకుడికి క్రేజ్ అమాంతం పెరిగింది. అదే జోష్ లో చిరు – బాబీ సినిమాకు డీఓపీ భాద్యతలు తీసుకున్నాడు. కానీ అనుకోని కారణాల వలన ఇప్పుడు ఈ సినిమా నుండి తప్పుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ స్థానంలో నిమిష్ రవిని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. ఇటివల వచ్చిన లోక సినిమాకు నిమిష్ రవి డీవోపీ గా వర్క్ చేసాడు. అలాగే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సూర్య 46 సినిమాకు కూడా నిమిష్ సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా చిరు సినిమా అఫర్ అందుకున్నాడు. ఎప్పుడో సెప్టెంబర్ లో మొదలు కావాల్సిన చిరు – బాబీ సినిమా సినిమాటోగ్రఫర్ కారణంగా షూటింగ్ డిలే అయింది. ఇప్పుడు నిమిష్ రాకతో ఆ అడ్డంకులు తొలగాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!