Site icon NTV Telugu

MEGA158 : చిరు – బాబీ సినిమా డీఓపీగా తప్పుకున్న మిరాయ్ దర్శకుడు

Mega 158

Mega 158

మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్‌ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ రెండు ప్రాజెక్ట్‌లు కాకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళేదుకు రెడీ అయ్యారు. అందుకు దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడట.

Also Read : Exclusive : మహేశ్ – రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్

కాగా ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ గా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిని తీసుకున్నారు. ఇటీవల మిరాయ్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ ఆ సినిమా సూపర్ హిట్ తో ఈ దర్శకుడికి క్రేజ్ అమాంతం పెరిగింది. అదే జోష్ లో చిరు – బాబీ సినిమాకు డీఓపీ భాద్యతలు తీసుకున్నాడు. కానీ అనుకోని కారణాల వలన ఇప్పుడు ఈ సినిమా నుండి తప్పుకున్నాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ స్థానంలో నిమిష్ రవిని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. ఇటివల వచ్చిన లోక సినిమాకు నిమిష్ రవి డీవోపీ గా వర్క్ చేసాడు. అలాగే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సూర్య 46 సినిమాకు కూడా నిమిష్ సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా చిరు సినిమా అఫర్ అందుకున్నాడు. ఎప్పుడో సెప్టెంబర్ లో మొదలు కావాల్సిన చిరు – బాబీ సినిమా సినిమాటోగ్రఫర్ కారణంగా షూటింగ్ డిలే అయింది. ఇప్పుడు నిమిష్ రాకతో ఆ అడ్డంకులు తొలగాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version