OTT Updates: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’.. డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTT Updates: దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మలయాళ సూపర్ హిట్ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మెగాస్టార్ గత చిత్రం ఆచార్య ఫ్లాప్‌తో నీరసించిపోయిన మెగా అభిమానులకు ఈ సినిమా ఫలితం కొద్దిగా ఊరటను కలగజేసింది. ఈ మూవీలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
Read Also: Naveen Chandra: తగ్గేదే లే.. ఆమె కోసమే 38సార్లు సినిమా చూశా.. ఇంతలా ఆ హీరోకు నచ్చిన నటి ఎవరంటే ?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజాగా నెట్‌ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. దీంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే నవంబర్ 19 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రమిది. చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్ నటించిన ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమన్ సంగీతం ఈ మూవీకి ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!