NTV Telugu Site icon

Chiranjeevi Hospital: సినీ కార్మికుల కోసం కొణిదెల ఆస్పత్రి.. ఛారిటీ కోసం తమన్ మ్యూజిక్ ఈవెంట్

Chiru Hospital

Chiru Hospital

Chiranjeevi Hospital: శుక్రవారం రాత్రి జరిగిన క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌ చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రిని వచ్చే ఏడాది తన పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే శక్తి తనకు ఉందని.. అయితే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చి రూ.20లక్షలు విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని చిరంజీవి అన్నారు. పెద్దాసుపత్రులకు వెళ్లలేని సినీ కార్మికులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చిత్రపురి కాలనీలో ఉండే సినీ కార్మికులతో పాటు బీపీఎల్ (బిలో పావర్టీ లైన్) లోపు ఉన్న వారికి, రోజు కూలీ చేసే కార్మికులకు ఉపయోగపడేలా ఈ ఆస్పత్రి ఉంటుందన్నారు.

ఈరోజు తాము లక్షల్లో సంపాదిస్తున్నామంటే కార‌ణం సినీ ప‌రిశ్రమేనని చిరంజీవి అన్నారు. అలాంటి పరిశ్రమకు ఎంతో కొంత మ‌నం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. ఎవరైనా భాగస్వామ్యులు అవుతానన్నా సరే.. సంతోషంగా వారికి కూడా ఈ ఆనందం, అనుభూతి అందిస్తానని మెగాస్టార్ చెప్పారు. అటు ఈ ఆస్పత్రి ఛారిటీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ముందుకు వచ్చాడు. తన వంతుగా మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించి ఫండ్స్ కలెక్ట్ చేస్తానని తమన్ చెప్పాడు. దీంతో తమన్‌ను చిరంజీవి అభినందించారు.

Show comments