ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు వరకూ రీజనల్ హీరోగానే ఉన్న రామ్ చరణ్ తేజ్, ఈరోజుకి గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వరల్డ్ వైడ్ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న చరణ్ శ్రీనగర్ చేరుకున్నాడు. జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ కోసం చరణ్ శ్రీనగర్ వెళ్ళాడు. 2019 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ ని క్యాన్సిల్ చేసింది. ఇది జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతూ ఉండడంతో, ప్రభుత్వం ఈ సమ్మిట్ ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశంలో కాశ్మీర్ ని ఫిలిం టూరిజంకి డెస్టినేషన్ గా ప్రమోట్ చెయ్యనున్నారు. ఇతర దేశ ప్రతినిధులని జమ్మూ కాశ్మీర్ లో సినిమా షూటింగ్స్ ని చేయమని ప్రమోట్ చేయనున్నాడు చరణ్. ఈ ప్రెస్టీజియస్ ఛాన్స్ చరణ్ కి రావడంతో మెగా ఫాన్స్ అంతా ఖుషిగా ఉన్నారు. అది సర్ మా బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శంకర్ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ డ్రామాగా రూపొందుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయిపోగానే చరణ్, బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయినా ఈ మూవీ కోసం రెహ్మాన్ ని రంగంలోకి దించే పనిలో ఉన్నారు ప్రొడ్యూసర్స్.
