Mega Movies back to back: జూలై 28 నుంచి మొదలు పెడితే ఆగస్టు 25వ తేదీ వరకు అంటే దాదాపు ఒక నెలపాటు మెగా ఫ్యాన్స్ కి పండగే పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో నాలుగు మెగా హీరోల సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ముందుగా జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో ది అవతార్ అనే సినిమా రిలీజ్ అవుతోంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక తమిళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఈ సినిమాని జులై 28వ తేదీన రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఆగస్టు 11వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అవుతుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేస్తున్నారు.
RC 16: రామ్ చరణ్ 16 కోసం రెహమాన్.. ఇక అదే లేటు!
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మేనర్ మీద అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్లో నియమిస్తున్నారు. ఇక ఆ సినిమా రిలీజ్ అయిన మరో వారం రోజుల వ్యవధిలోనే పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఆదికేశవ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మరో వారం రోజులకు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాండీవ దారి అర్జున సినిమా కూడా రిలీజ్ అవుతుంది. భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా మీద కూడా మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంటే జూలై 28వ తేదీన మొదలుపెడితే మధ్యలో ఒక వారం గ్యాప్ ఇచ్చిన తర్వాత వరుసగా మెగా హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయన్నమాట. నిజానికి ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు మెగా హీరోలు సినిమాలన్నీ బాగా ఆడతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.