Mega Heros : మెగా హీరోలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఎవరికి వారే సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. వీరిలో ఎవరు కనిపించినా సోషల్ మీడియాలో వారి ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అయిపోతుంటాయి. అలాంటిది ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఆ జోష్ మామూలుగా ఉండదు కదా. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్ లో ఎక్సర్ సైజ్ అయిపోయిన తర్వాత వీరు ముగ్గురూ ఇలా ఫొటో దిగారు. ఇందులో ముగ్గురి లుక్ రఫ్ గానే కనిపిస్తోంది.
Read Also : WAR 2 : వార్ 2 రన్ టైమ్ ఫిక్స్.. హిందీకే ఇంపార్టెన్స్
రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఓ సినిమాను లైన్ లో పెట్టాడు. ఇలా ముగ్గురు సినిమాల షూటింగులో బిజీగా ఉంటూనే వీలు కుదిరినప్పుడల్లా ఇలా జిమ్ లో కలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ ఒకే జిమ్ ట్రైనర్ దగ్గర ఫిట్ నెస్ కోర్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పెద్ది మూవీలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. దానిపై ఇంకా ప్రకటన రాలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
Read Also : Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు
