Site icon NTV Telugu

Mega Heroes: చరణ్ సినిమాలో వాల్తేరు వీరయ్య రిఫరెన్స్… మెగా మాస్

Rc 15

Rc 15

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపిస్తే చాలు మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యడం కాదు ఒక్క ఫోటో దిగినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ కూడా చిరుని తండ్రిలా కన్నా ఒక అభిమానిగా ఆరాదిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ సన్ గోల్స్ ని సెట్ చేసే చిరు, చరణ్ లని మళ్లీ ఒకే సినిమాలో చూడబోతున్నామా? అవును అనే సమాధానం రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, చరణ్ సినిమాలో చిరుని చూపించడానికి రెడీ అయ్యాడు. రీసెంట్ గా కర్నూల్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న RC 15 మూవీ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతోంది. కియారా అద్వానీ, చరణ్ ల పైన స్పెషల్ గా డిజైన్ చేసిన సాంగ్ ని ఇక్కడ షూట్ చేస్తున్నారు.

వైజాగ్ షెడ్యూల్ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో చరణ్ తలకి బ్యాండ్ కట్టుకోని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. వైజాగ్ లోని జగదాంబ థియేటర్ దగ్గర ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్ రోజున ఫాన్స్ చేసే హంగామాని షూట్ చేస్తున్న శంకర్, చరణ్ ని చిరు ఫ్యాన్ గా మార్చి మెగా అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. చరణ్, చిరుకి ఫ్యాన్ అంటే థియేటర్స్ లో RC 15 సినిమా చూసే సమయంలో మెగా ఫాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. పైగా చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ లో భాగంగా తెరకెక్కిస్తున్న సాంగ్ లోనే చిరు౦చరన్ కలిసి కనిపిస్తున్నారు అంటే ఫాన్స్ చేసే హంగామాకి థియేటర్ టాపు లేచిపోవడం గ్యారెంటీ. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఫస్ట్ లుక్ మార్చ్ 17న చరణ్ పుట్టిన రోజున రిలీజ్ కానుంది.

Exit mobile version