NTV Telugu Site icon

హాకీ ప్లేయర్ గా ‘ఉప్పెన’ హీరో!?

తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ అవతారం ఎత్తబోతున్నాడట. ఫస్ట్ సినిమాలో లవర్ బోయ్ గా ఆకట్టుకున్న వైష్ణవ్ క్రిష్ తో చేస్తున్న రెండో సినిమా ‘కొండపొలం’లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రతి సినిమాలోనూ పాత్రల మధ్య వేరియేషన్ చూసించాలనుకుంటున్న వైష్ణవ్ అన్నపూర్ణస్టూడియో పతాకంపై నాగార్జున నిర్మించే సినిమాలో హాకీ క్రీడాకారునిగా కనిపిస్తాడట. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు కొత్త దర్శకుడు పృధ్వీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నాడట వైష్ణవ్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కాస్ట్, క్రూ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.