NTV Telugu Site icon

Ram Charan: నేషనల్ అవార్డ్ నీకెందుకు రాలేదు అన్నా…?

Ram Charan

Ram Charan

69న నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకోని నిలబడింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే హిందీ సినిమా, తమిళ సినిమా గుర్తొచ్చేవి… ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా గుర్తొచ్చేలా చేసారు మన దర్శకలు, నిర్మాతలు, హీరోలు, సినీ అభిమానులు. పది నేషనల్ అవార్డ్స్ గెలిచి తెలుగు సినిమా ఆగమనాన్ని ఘనంగా చాటింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ‘రామ్ చరణ్’కి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డ్ రాకపోవడంపై డిజప్పాయింట్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సెటిల్డ్ ఎమోషన్స్ ని మెస్మరైజ్ అయ్యే రేంజులో పెర్ఫార్మ్ చేసాడు రామ్ చరణ్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి వెస్టర్న్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే బెస్తేరో కేటగిరిలో రామ్ చరణ్ కి అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకోని ఉన్నారు.

ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ సినిమా అవ్వడంతో రామ్ చరణ్ కి అవార్డ్ రాలేదు అనే వాదన వినిపిస్తోంది. నిజానికి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ రాలేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఐ మొదటిసారి కాదు గతంలో రంగస్థలం సినిమాకి కూడా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ వస్తుందని అంతా అనుకున్నారు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరూ నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అనుకున్నారు కానీ అప్పుడు కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. ఆర్ ఆర్ ఆర్, రంగస్థలం సినిమాల్లో రామ్ చరణ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు  అనే విషయం ప్రతి సినీ అభిమానికి తెలుసు. అందుకే రామ్ చరణ్ కి గ్లోబల్ రీచ్ వచ్చింది, మరి రాబోయే రోజుల్లో అయినా చరణ్ కి నేషనల్ అవార్డ్ వస్తుందేమో చూడాలి.