NTV Telugu Site icon

Charmme Kaur: ఆ పనిచేసి అడ్డంగా దొరికిన ఛార్మీ.. ఆడేసుకుంటున్న నెటిజన్స్

Charmee

Charmee

Charmme Kaur: కర్మ.. దాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. విజయం అందినప్పుడు వేరేవారి మీద రాయి వేసినప్పుడు పరాజయం పాలు అయ్యినప్పుడు తమ మీద కూడా రాళ్లు పడతాయని గ్రహించాలి. అందుకే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు పోస్ట్లు పెట్టేటప్పుడు ముందు వెనుక చూసుకోవాలి. ఏ హీరోను తక్కువ చేసి చూడకూడదు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనేగా.. లైగర్ సినిమా ప్లాప్ తో నిండా మునిగిపోయింది నటి, నిర్మాత ఛార్మీ. ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఈ సినిమా తీశామని, ఓటిటీ ఆఫర్ వచ్చినా ఇవ్వలేదని.. కంటనీరు పెట్టుకొంది. ఆమె ఎమోషనల్ వీడియో చూసి నిజంగానే సినిమా ఎంత బావుంటుందో అనుకోని థియేటర్ కు వెళ్లినవారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.

ఇక దీంతో ఛార్మీ ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇక దీంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను కూడా బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ 2015 అక్టోబర్ 16 న రిలీజ్ అయిన విషయం తెల్సిందే. మొదటి షోకే ఈ సినిమా ప్లాప్ టాక్ ను అందుకొంది. ఇక అదేరోజు ఛార్మీ ట్విట్టర్ లో నవ్వుతున్న ఎమోజీలు, చప్పట్లు కొట్టే ఎమోజీలు షేర్ చేసింది. ఇక ఆరోజు సినిమా ప్లాప్ టాక్ అందుకోవడంతోనే ఛార్మీ ఈ ట్వీట్ చేసిందని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు లైగర్ ప్లాప్ అవ్వడంతో ఆ ట్వీట్ ను బయటికి తీసుకొచ్చి ఆమెను ఆడేసుకుంటున్నారు. ఒకరి ఫెయిల్యూర్ కు నవ్వితే.. ఎప్పటికన్నా కర్మ మళ్లీ మిమ్మల్ని తిరిగి గట్టిగా కొడుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా స్టార్.. ఒకప్పుడు అతడిని విమర్శించినా వారే ఇప్పుడు చరణ్ ను ప్రశంసిస్తున్నారు. అది సక్సెస్ అంటే అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.