మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ లుక్స్ ని లీక్ చేస్తే మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్ స్టూడెంట్ లుక్… ఇలా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు అనే మాట బయటకి వచ్చింది కానీ ఎలాంటి రోల్ చేస్తున్నాడు అనే పూర్తిగా ఎవరికీ తెలియదు. భారతీయుడు సినిమాలో ఓల్డ్ కమల్ హాసన్ క్యారెక్టర్ రేంజులో RC 15లో ఫాదర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది.
ఈ విషయాన్ని మర్చిపోయిన మెగా అభిమానులు, చరణ్ రాజమండ్రిలో కనిపించగానే ఫోటోస్ అండ్ వీడియోస్ తీసి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. దీని కారణంగా చరణ్ విలేజ్ లుక్ రివీల్ అయిపొయింది, చరణ్ పక్కన ఉన్న శ్రీకాంత్ లుక్ కూడా రివీల్ అయిపొయింది. ‘అభ్యుదయ పార్టీ’ పెట్టిన ఈ మీటింగ్ సీన్ ‘RC 15’లో ఇంపార్టెంట్ సీన్ అయ్యి ఉంటే, థియేటర్ లో చూస్తే వచ్చే ఎగ్జైట్మెంట్ ని మెగా అభిమానులు తగ్గించినట్లే అవుతుంది. వేరే ఎవరైనా లీక్ చేస్తే ఆపాల్సిన ఫాన్స్, స్వయంగా ఇలా లీక్ చేయడం సినిమాకి నష్టం కలిగించే విషయమే. ఈ లీక్ అయిన ఫొటోస్ లో కనిపిస్తున్న ‘అభ్యుదయ పార్టీ’ అనేది చరణ్ పార్టీనా లేక శ్రీకాంత్ పార్టీకి చరణ్ ప్రచారం చేస్తున్నాడా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నింటికి సమాధానం తెలియాలి అంటే RC 15 రిలీజ్ అయ్యే వరకూ ఆగాలి. ఈలోపు జనవరి 1న RC 15 ఫస్ట్ లుక్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. మేకర్స్ మెగా అభిమానులకి మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ అభిమానులందరికీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే రేంజులో RC 15 ఫస్ట్ లుక్ ఉండబోతుందని సమాచారం.