Site icon NTV Telugu

Dil Raju: ఆ పని చేయండి ప్లీజ్.. దిల్ రాజుకు మెగా ఫ్యాన్స్ విజ్ఞప్తి

Dilraju

Dilraju

Mega Fans Request To Dil Raju: కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత మెగా అభిమానులందరూ టెన్షన్లో ఉన్నారు. దానికి కారణం రాంచరణ్ తర్వాతి సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడమే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తికాగా 10- 15 రోజుల షూటింగ్ మిగిలిందని ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో శంకర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజుల షూట్ ముగించారు కూడా. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ ఫాన్స్ టెన్షన్ లో ఉన్నారు. దానికి కారణం ఈ సినిమా విషయంలో శంకర్ అన్ని విషయాలను తన అధీనంలో ఉంచుకోవడమే. శంకర్ దిల్ రాజుని ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వనివ్వడం లేదని తెలుస్తోంది.

Also Read: Anjali: బోల్డ్ సీన్స్ అలానే చేశా..అంజలి షాకింగ్ కామెంట్స్

ఇప్పటివరకు వచ్చిన రషెస్ ని కూడా అటు రామ్ చరణ్ కి కానీ ఇటు దిల్ రాజుకు కానీ శంకర్ చూపించలేదట. ఎడిట్ సూట్ కూడా చెన్నైలోనే ఉండడంతో ఆ సూట్ కూడా పూర్తిగా శంకర్ అధీనంలోనే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగా అభిమానులందరూ దిల్ రాజు ఈ సినిమాని ముందుగా తన అధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అంతే కాక కంటెంట్ బాలేదు అనిపిస్తే రీ షూట్స్ కూడా చేయించాలని కూడా కోరుతున్నారు. ఇండియన్ 2 విషయంలో శంకర్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని దిల్ రాజుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి శంకర్ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉన్నాడు. ఆగస్టు చివరిలోపు షూటింగ్ ముగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా నెక్స్ట్ సాంగ్ కూడా ఆగస్టులో రిలీజ్ అవుతుందని థమన్ ఇప్పటికే ప్రకటించాడు.

Exit mobile version