Site icon NTV Telugu

Mega Family: వారసురాలిని చూడడానికి క్యూ కట్టిన మెగా ఫ్యామిలీ

Mega Family

Mega Family

మెగా కోడలు ఉపాసన వారసురాలికి జన్మనించ్చింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా మెగా ప్రిన్సెస్ ని చూడడానికి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఉదయం 1:49 కి ఉపాసనకు పాప పుట్టింది, మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం‌ ముందునుంచి మా కుటుంబంలో కనబడుతోంది. చరణ్ కెరీర్ లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్ మెంట్ ఇలా మా ఫ్యామిలీలో అన్నీ శూభాలే జరుగుతున్నాయి” అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహ కూడా అపోలో హాస్పిటల్ కి వచ్చారు. గత కొంతకాలంగా అల్లు-మెగా కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది అనే వార్త వినిపిస్తోంది. ఆ వార్తలకి ఈరోజు ముగింపు పలికినట్లు అయ్యింది.

Exit mobile version