Site icon NTV Telugu

Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్

Brothers

Brothers

Pawan Kalyan: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఈ సాయంత్రం కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈ విషయం తెలియడంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. రాజ్- కోటి అంటే ఒక బ్రాండ్.. ఎన్నో వేల పాటలు.. ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ద్వయం. ఒకరు లేనిదే మరొకరి గురించి మాట్లాడలేని స్నేహం. ఇప్పుడు అందులో ఒక గొంతు మూగబోయింది. రాజ్ లేని కోటిని ఉహించుకోలేం. ఇక ఆయన మృతితో దిగ్బ్రాంతికి గురైన సినీ ప్రముఖులు.. ఆయనతో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మెగా బ్రదర్స్.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా వారు ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి కెరీర్ లో రాజ్- కోటి ఎన్నో హిట్ మూవీస్ ఇచ్చారు. ఆ విషయాన్నీ కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. “ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో ‘రాజ్’ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి !” అంటూ చిరు ఎమోషనల్ అయ్యాడు.

Music Director Koti: మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటారు..

ఇక పవన్ కళ్యాణ్ సైతం రాజ్ కు సంతాపం వ్యక్తం చేశాడు. “సినీ సంగీత దర్శకులు శ్రీ రాజ్ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టి.వి.రాజు గారి వారసుడుగా తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ – కోటి ద్వయంగా చక్కటి సంగీతం అందించారు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన యముడికి మొగుడు, ఖైదీ నెం.786, త్రినేత్రుడు లాంటి చిత్రాలకు ప్రాచుర్యం పొందిన గీతాలు అందించడంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. శ్రీ రాజ్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version