Site icon NTV Telugu

Mega 156: జగదేక వీరుడు… ‘విశ్వంభర’గా వస్తున్నాడు

Mega 156

Mega 156

మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి సంక్రాంతి పండగ రోజున టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. జనవరి 15న సాయంత్రం 5 గంటలకి మెగా 156 ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాం అంటూ ప్రొడ్యూసర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

Read Also: Avanthika: మహేష్ పక్కన నటించిన ఈ అమ్మాయి… 18 ఏళ్లకే హాలీవుడ్ లో దుమ్ములేపుతోంది

కీరవాణి మ్యూజిక్ వర్క్స్ తో మెగా 156 ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ తో సాలిడ్ బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ. అయితే ఈ ఫాంటసీ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ని ఫిక్స్ చేశారనే టాక్ చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పూజా కార్యక్రమాల సమయంలో కూడా స్క్రిప్ట్ పేపర్స్ పైన విశ్వంభర అనే టైటిల్ పిక్ లీక్ అయ్యింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా విశ్వంభర టైటిల్ ని ఫుల్ వైరల్ చేసారు. జగదేక వీరుడు ఈసారి విశ్వంభరగా వస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. మరి మేకర్స్ ఇదే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా లేక టైటిల్ మార్చి కొత్త ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి.

Read Also: Prabhas: “రాజా సాబ్” కోసం భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్…

Exit mobile version