Site icon NTV Telugu

Mega 154 : సంక్రాంతి పోరులో మెగాస్టార్ చిరంజీవి

Mega 154

Mega 154

మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్‌ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ 40% చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జికె మోహన్ సహ నిర్మాత. చిరంజీవికి పలు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version