Site icon NTV Telugu

Meera Vasudevan : ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్న నటి

Meera

Meera

Meera Vasudevan : మలయాళ బ్యూటీ మీరా వాసుదేవన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గోల్‌మాల్’ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా, తరువాత ‘అంజలి ఐ లవ్ యూ’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సినిమాల్లో సక్సెస్ అయింది గానీ.. పర్సనల్ లైఫ్‌ లో ఇబ్బందులు పడుతోంది. 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కొడుకు విశాల్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది.

Read Also : Top Budget Movies : ఇండియాలో టాప్-3 హై బడ్జెట్ సినిమాలు ఇవే

ఆ తర్వాత విలన్‌గా ప్రసిద్ధి చెందిన జాన్ కొక్కెన్‌తో 2012లో పెళ్లి పీటలెక్కింది. ఓ కొడుకు పుట్టాక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కెమెరామెన్ విపిన్‌తో పరిచయం పెరగడంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2024 మేలో కోయంబత్తూరులో ఈ జంట వివాహం చేసుకుంది. కానీ ఏం లాభం.. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన మీరా, తాను ఇకపై ఒంటరిగానే ముందుకు సాగుతానని తెలిపింది. ముచ్చటగా మూడోసారి కూడా విడాకులు తీసుకుంది ఈ బ్యూటీ.

Read Also : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..

Exit mobile version